పాక్ భూభాగంలోకి భారత్ డ్రోన్
సాంకేతిక లోపంతోనే అన్న అధికారులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పాక్ భూభాగంలోకి సాంకేతిక లోపంతో భారత్ కు చెందిన డ్రోన్ వెళ్లింది. దీనిపై ఆర్మీకి సమాచారం అందింది. శుక్రవారం ట్రైనింగ్ మిషన్ లో ఉండగా డ్రోన్ పాక్ భూభాగంలోకి నియంత్రణ కోల్పోయి వెళ్లిందని ఆర్మీ అధికారులు వివరించారు. కాగా ఈ డ్రోన్ ను పాక్ లోని నికియాల్ సెక్టార్ లో పాక్ స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీకి సమాచారం అందిందని పేర్కొంది. ఈ సందేశంపై భారత్ తిరిగి సమాధానం పంపిందని ఆర్మీ అధికారులు తెలిపారు.