మద్యం కుంభకోణం.. 12 చోట్ల తనిఖీలు

అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న సీఎం విష్ణుదేవ్​ సాయ్​ ప్రభుత్వం

Feb 25, 2024 - 17:11
 0
మద్యం కుంభకోణం.. 12 చోట్ల తనిఖీలు

రాయ్​ పూర్​: ఛత్తీస్​ గఢ్​ లో విష్ణుదేవ్​ సాయ్​ ప్రభుత్వం నెలకొనగానే అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. మధ్యం కుంభకోణానికి సంబంధించి ఆదివారం ఈఓడబ్ల్యూ, ఏసీబీ అధికారులు రాజధాని రాయ్​ పూర్​, బిలాస్​ పూర్​, దుర్గ్​ జిల్లాలోని 12 చోట్ల ఆదివారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. 

అధికారులు, రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారుల అక్రమ సిండికేట్ కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో రూ.2000 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ఈడీ విచారణలో వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణంపై విచారణ జరగకపోవడం గమనార్హం. ప్రభుత్వం మారిన వెంటనే ఈడీ ఎఫ్​ ఐఆర్​ నమోదు చేసింది. అనంతరం చర్యలకు ఉపక్రమించింది. ఈడీతోపాటు వివిధ దర్యాప్తు సంస్థలు కూడా కుంభకోణంపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

బిలాస్‌పూర్‌ సర్గావ్‌లోని భాటియా డిస్టిలరీ, కోటాలోని వెల్‌కమ్ డిస్టిలరీ, కుమ్హారి దుర్గ్‌లోని కేడియా డిస్టిలరీ, రాయ్‌పూర్‌లోని అన్వర్ ధేబర్, వివేక్ దండ్, అనిల్ టు తేజా మద్యం వ్యాపారంలో అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ, ఈఓడబ్ల్యూలు పేర్కొంటున్నాయి. స్వర్ణ  భూమి కాంప్లెక్స్‌లో ఉన్న మద్యం వ్యాపారి, ఐటీఎస్ అధికారి, మాజీ ఎక్సైజ్ ఎండీ ఏపీ త్రిపాఠి భార్యకు సంబంధించిన సంస్థలో కూడా దాడులు కొనసాగుతుండడం విశేషం.