భారత్ –చైనా ఎల్ వోసీపై పరిస్థితులు శాంతియుతం
పార్లమెంట్ లో విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్–చైనా మధ్య సరిహద్దు వివాదాల సమసిపోయి పరిస్థితి సాధారణంగా ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. మంగళవారం పార్లమెంట్ లో భారత్–చైనా వివాదాలు, సంబంధాలపై ప్రసంగించారు. మరింత శాంతికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ఎల్ వోసీపై పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. సమస్యలు ఇరుదేశాల అంగీకారంతోనే పరిష్కారం దిశగా వెళుతున్నామన్నారు. ఎల్ వోసీపై శాంతి పునరుద్ధరణలో సైన్యం కీలకపాత్ర పోషించిందన్నారు. దౌత్యపరమైన చర్యలు ఇరుదేశాలు యథాతథ స్థితిలో ఉంటేనే సాధ్యపడుతుందని, ఏకపక్షంగా ఆలోచిస్తే ఏ సమస్యలు పరిష్కారం కావన్నారు. అదే సమయంలో ఇరుదేశాలు ఒప్పందాల ప్రకారమే నడుచుకుంటున్నాయని జై శంకర్ తెలిపారు. 2020 నుంచి ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయన్నారు. ఇటీవల భారత్–చైనా పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కారం దిశగా సత్ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. న్యాయమైన, సహేతుకమైన ఫ్రేమ్ వర్క్ తో ద్వైపాక్షిక చర్చలు జరిగాయని తెలిపారు. లడఖ్ లోని డెప్పాంగ్, డెమ్ చోక్, గాల్వాన్ లలో ప్రస్తుతం శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి జై శంకర్ పార్లమెంట్ కు సమాధానమిచ్చారు.