ఎల్​ డబ్యూఇ నుంచి 60 జిల్లాలకు విముక్తి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్​

Dec 4, 2024 - 18:22
 0
ఎల్​ డబ్యూఇ నుంచి 60 జిల్లాలకు విముక్తి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఎల్​ డబ్ల్యూ ఇ (లెఫ్ట్​ వింగ్​ తీవ్రవాదం) నుంచి దేశంలోని 60 జిల్లాలు విముక్తి పొందాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్​ తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. తీవ్రవాద సమస్యను పరిష్కరించేందుకు ధృఢమైన ప్రణాళిక, కార్యాచరణను రూపొందించామన్నారు. దీంతో హింసను తగ్గించగలిగాన్నారు. భౌగోళికంగా 60 జిల్లాలో శాంతియుత పరిస్థితులను తీసుకురాగలిగామన్నారు. 2010తో పోలిస్తే 73 శాతం హింసాత్మక ఘటనలను తగ్గించగలిగామని మంత్రి తెలిపారు. భద్రతా బలగాలు, పౌరుల మరణాల సంఖయ 2023లో 138కి తగ్గిందన్నారు. 2024 ఏప్రిల్​ నాటికి భద్రత దళాలు, పౌరుల మరణాల సంఖ్య 38కి తగ్గిందన్నారు. తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాలు, ప్రాంతాలలో రూ. 350 కోట్ల అభివద్ధి, శాంతిభద్రతల కోసం విడుదల చేసినట్లు తెలిపారు. తద్వారా స్థానికులకు ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయన్నారు. క్రమేణా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు శాంతియుత జీవనానికి మద్ధతు తెలియజేస్తున్నాయన్నారు. దీంతో స్థానిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపారు.