నా తెలంగాణ, ఆదిలాబాద్: ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని బేల మండలం సాంగిడి, బేదోడ గ్రామంలో మంగళవారం జిల్లా పాలనాధికారి (కలెక్టర్) రాజర్షి షా దెబ్బతిన్న ఇళ్లు, కల్వర్టులు, పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి సాంగిడి, బెదొడ గ్రామాలలో పర్యటించి పంట, ఇళ్ల నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ రైతుల పంట పొలాల్లోకి నీరు చేరడం వల్ల పంటలు దెబ్బతిన్నాయని దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు జిల్లాలో ఎక్కడెక్కడ పంటలకు నష్టం వాటిల్లిందో సర్వే చేసి నష్టపోయిన రైతుల అకౌంట్ నంబర్, ఆధార్ కార్డు వివరాలను 12వ తేదీలోగా నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఎకరానికి రూ. 10 వేల చొప్పున వారి అకౌంట్ లో జమ చేస్తామన్నారు.
అలాగే 31 ఆగస్టు నుంచి, సెప్టెంబర్ 8 వరకు కచ్చా ఇళ్లు గానీ పక్కా ఇళ్లు గాని ఏవైనా వర్షానికి కూలిపోతే వాటి వివరాలను తహసీల్దార్లు సేకరించి ట్రెజరీ ద్వారా వివరాలు పొందుపరుస్తామన్నారు. వీటిని ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. రూ. 16,500 చేస్తామన్నార. శాశ్వత పరిష్కారం కోసం ఒక పంట మీదనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, ఆయిల్ ఫాం, ఇతర పంటలను వేసుకోవాలని, చెక్ డ్యామ్ లు నిర్మించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి వెంట ఎమ్మార్వో, ఎంపీడీవో తదితరులు ఉన్నారు.