ఏడేళ్లలో 84వేలమంది చిన్నారుల రక్షణ
సత్ఫలితాలిస్తున్న ‘నన్హే ఫరిస్తే’ వివరాలు వెల్లడించిన ఆర్పీఎఫ్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గత ఏడేళ్లలో ‘నన్హే ఫరిస్తే’అనే కార్యక్రమం పేరుతో 84వేల మంది చిన్నారులను రక్షించినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎప్) తెలిపింది. బుధవారం ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం రైల్వే జోన్ లలో అమాయకులైన, అనాథలై, కిడ్నాప్ కు గురైన పిల్లలను వారి తల్లిదండ్రులు, బంధువులు, అనాథాశ్రమాలకు చేర్చడమే లక్ష్యంగా తెలిపారు.
ఈ ఏడాది ఐదు నెలల్లోనే ఆర్పీఎఫ్ 4,607మంది పిల్లలను రక్షించగా, గతేడాది 11,794 మంది చిన్నారులను రక్షించినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.