రెండుగంటలు వెయింటింగ్
లైవ్ ప్రసారాలకు వైద్యుల పట్టు
చర్చలకు రాని వైద్య బృందం
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతతో చర్చల్లో పాల్గొనేందుకు మరోమారు ప్రభుత్వ వైద్యులు గైర్హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని వైద్యులను చర్చలకు పిలవాలని ఆదేశించింది. వారితో చర్చించి వారి డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకొని సమ్మె సద్దుమణిగేలా చేయాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆర్జీకర్ మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాలులో సీఎం మమత గురువారం వైద్యులతో సమావేశం నిర్వహించేందుకు రెండుగంటపాటు నిరీక్షించారు. అయినా వైద్యులు సీఎంతో చర్చకు రాలేదు. దీంతో సీఎం మమత వెనుదిరుగుతూ మీడియాతో మాట్లాడారు. సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తుందన్నారు. తాము వైద్యులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయినా వైద్యులు రాలేదన్నారు. సుప్రీం ఆదేశాల అనుసారంగా నడుచుకున్నామని సీఎం మమత తెలిపారు. సమావేశాన్ని పూర్తి వీడియో రికార్డింగ్ చేసి సుప్రీం ముందుంచాలని ఆదేశాలున్నాయని తెలిపారు.
సమావేశాన్ని మీడియాలో లైవ్ గా ప్రసారం చేయాలని, 15 మందికి బదులుగా 32 మంది వైద్యుల బృందం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వస్తుందని సీఎం మమత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వైద్యులు డిమాండ్ చేశారు. వైద్య బృందంతో చర్చలకు మమత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా లైవ్ ప్రసారాలపైనే భేదాభిప్రాయాలు నెలకొని చర్చలు నిలిచిపోయాయి.