ఘనంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు
అధికారులను ఆదేశించిన కలెక్టర్
నా తెలంగాణ, మెదక్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
17న జరగనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడులకు ముఖ్య అతిథిగా ప్రభుత్వం తరఫున కే. కేశవరావు రానున్నట్లు తెలిపారు. అన్ని పాఠశాలలు, కార్యాలయాల్లో ఉదయం 9:30 గంటల వరకు జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. అలాగే సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పది గంటలకు ముఖ్య అతిధి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, ముఖ్యఅతిథి సందేశం, పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ప్రదర్శన వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటికీ సంబంధించిన షెడ్యూల్ ను రూపొందించుకోవాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావీయవద్దని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.