గణనాథునికి వీడ్కోలు

మంబోజిపల్లి శివాజీ గణేష్​ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనం

Sep 12, 2024 - 20:26
 0
గణనాథునికి వీడ్కోలు
నా తెలంగాణ, మెదక్​: ఐదురోజులపాటు ఘనంగా పూజలందుకున్న గణనాథుల విగ్రహాలు నిమజ్జనాల క్రతువుతో వేడుకలు పూర్తవుతున్నాయి. మంబోజిపల్లి శివాజీ గణేష్​ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథున్ని గుర్రప బొమ్మల బండిపైన తీసుకువెళుతూ, శోభాయాత్ర ద్వారా అశేష జనవాహిని మధ్య నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా లంబోదరున్ని వివిధ రకాల పూలతో అలంకరించి వీడ్కోలు పలికారు. చిన్నా, పెద్ద, మహిళలు, బాలికలు వినాయకుడి ఊరేగింపులో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలతో గ్రామంలోని పురవీధుల్లో విఘ్నేశ్వరున్ని ఊరేగించారు. అనంతరం గ్రామ శివారులోని పసుపులేరులో నిమజ్జనం చేశారు. 
 
ఈ కార్యక్రమంలో శివాజీ గణేష్ మండలి సభ్యులు కాంగ్రెస్ నాయకుడు మహేష్ గౌడ్, మేకల నరసింహులు, రాజు పవన్ పృథ్వీ, శ్రీకాంత్, నాగరాజు, శేఖర్ గౌడ్, సిద్ధి రాములు, శీను, గ్రామస్తులు తదితరులు  పాల్గొన్నారు.