రాబోయే తరాలకు స్ఫూర్తి ఆమె వెంటే దేశమంతా

ఆర్​ ఎఫ్​ చైర్​ పర్సన్​ నీతా అంబానీ

Aug 7, 2024 - 18:05
 0
రాబోయే తరాలకు స్ఫూర్తి ఆమె వెంటే దేశమంతా

ముంబై: వినేష్​ ఫోగట్ రాబోయే తరాలకు స్ఫూర్తి అని రిలయన్స్​ ఫౌండేషన్​ చైర్​ పర్సన్​ నీతా అంబానీ అన్నారు. వినేష్​ ఫోగట్​ సంకల్పబలం చాలా గొప్పదని బాధాకర సమయంలో తామంతా ఆమె వెంట ఉన్నామని నీత అంబానీ స్పష్టం చేశారు. వినేష్​ డిస్​ క్వాలిఫై పై నీతా మంగళవారం సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. దేశం మొత్తం ఫోగట్​ వెంట ఉందన్నారు. నిజమైన ఫైటర్​ వినేష్​ బాధపడాల్సిన అవసరం లేదన్నారు. వినేష్​ కు ప్రతికూల పరిస్థితులను అధిగమించే సామర్థ్యం ఉందన్నారు.