యా..యా.. సుప్రీం కాఫీ షాప్ కాదు!
లాయర్ పై న్యాయమూర్తి చంద్రచూడ్ ఆగ్రహం మాజీ సీజైఐ పేరును తొలగించాలని ఆదేశం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరుగుతుండగా న్యాయవాది పలుమార్లు యా..యా..యా.. అనడంపై న్యాయమూర్తి చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఈ పిటిషన్ పై జస్టిస్ చంద్రచూడ్ విచారణ చేపడుతూ పలు వ్యాఖ్యలు చేస్తుండగా న్యాయవాది పలుమార్లు యా..యా..యా.. అన్నారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ కోర్టు కాఫీ షాప్ కాదని అన్నారు. మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. వెంటనే పిటిషన్ నుంచి మాజీ సీజేఐ పేరును తొలగించాలని న్యాయవాదిని ఆదేశించారు.