భాగ్యనగరంలో సైన్స్ సిటీ
హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి రూ. 232.70 కోట్లతో ఏర్పాటు
నా తెలంగాణ, హైదరాబాద్: శాస్త్రీయ పరిజ్ఞానంలో శాస్త్రీయ యువతకు మరింత తోడ్పాటు నందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం హైదరాబాద్ ను సైన్స్ సిటీ రూపకల్పనకు ఎన్నుకోవడం సంతోషకరమని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం సామాజిక మాధ్యమంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో రూ. 232.70 కోట్లతో ఏర్పాటు చేయనున్న సైన్స్ సిటీపై వివరాలందించారు. భాగ్యనగరంలో ఏర్పాటు చేయబోయే సైన్స్ సిటిలో ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు సమావేశ హాలు, ఎగ్జిబిషన్, 3 డీ డిజిటల్ థియేటర్, స్పేస్ సైన్సెస్, రోబోటిక్స్ సెంటన్ ఇలా ఎన్నో విభాగాలను ఏర్పాటు చేయనుందన్నారు. భవిష్యత్ లో నగరంలోని సైన్స్ సిటీ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా మారనుందన్నారు. ఇక్కడి నుంచే అనేక పరిశోధనలు, ఆవిష్కరణలు చోటు చేసుకొని భాగ్యనగర ప్రతిభను మరింత ఇనుమడింప చేస్తాయని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.