ఢిల్లీ కాలుష్యం.. ప్రభుత్వం, పోలీసులపై సుప్రీం ఆగ్రహం
Delhi pollution.. Supreme anger against government and police
113రహదారుల్లో 13 సీసీ టీవీకెమెరాలేనా?
అత్యావసర వాహనాలే వస్తున్నాయా?
పికెటింగ్ కు యువ న్యాయవాదులను నియమించాలా?
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ కాలుష్యంపై శుక్రవారం సుప్రీంకోర్టు మరోమారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆరాతీసింది. ఈ సందర్భంగా జస్టిస్ ఓకా మాట్లాడుతూ ఢిల్లీకి వచ్చే 113 రహదారుల ఎంట్రీ పాయింట్ల వద్ద కేవలం 13 సీసీటీవీలను మాత్రమే ఏర్పాటు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఎంట్రీ పాయింట్ల వద్ద అత్యవసర వాహనాలతోపాటు ఇతర వాహనాలను కూడా అనుమతిస్తున్నట్లు అనుమానించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంటే బార్ అసోసియేషన్ యువ న్యాయవాదులను కూడా ఆయా రహదారుల్లో పికెటింగ్ కు విధులు అప్పజెప్పి నిజనిజాలు నిగ్గు తేలుస్తామని హెచ్చరించింది. కోర్టు స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసినా స్టేజ్–4లోని ఆంక్షలను ఎందుకు అమలు చేయడంలో ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వం విఫలమవుతున్నాయని ప్రశ్నించింది. తదుపరి విచారణను నవంబర్ 25కు వాయిదా వేసింది.