స్వంత ప్రాముఖ్యత ఐపీఎస్ సొంతం
రాష్ట్రపతి భవన్ లో ఐపీఎస్ లతో రాష్ట్రపతి ముర్మూ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇండియన్ పోలీస్ సర్వీస్ స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. సోమవారం న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో 2023 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ప్రొబేషనర్ల బృందం రాష్ర్టపతిని కలిసింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముర్మూ ప్రసంగించారు. లా అండ్ ఆర్డర్ కాపాడడంలో ఐపీఎస్ లు కీలక భూమిక పోషిస్తున్నారని కితాబిచ్చారు. నూతన పోకడలతో వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లడాన్ని అభినందించారు. రాబోయే యేళ్లలో భారత్ నూతన శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ అభివృద్ధిలో ఐపీఎస్ ల పాత్ర మరింత కీలకంగా మారనుందని ముర్మూ తెలిపారు. చట్టబద్ధత సక్రమంగా ఉన్నచోటే ఆర్థిక, సామాజికాభివృద్ధి సాధించగలమన్నారు. శాంతిభద్రతలను కాపాడడం, న్యాయానికి కట్టుబడి ఉండడం, సామాన్య పౌరుల హక్కులను పరిరక్షించడంతో పురోగతి సాధ్యపడుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు.