నాసిరకం భోజనంపై భగ్గు

కళ్లలో కారం కొట్టి బెదిరిస్తున్న ఉపాధ్యాయులు నడిరోడ్డుపై బైఠాయించిన గురుకుల పాఠశాల విద్యార్థినిలు ఉన్నతాధికారులకు తెలిపినా చర్యలు శూన్యం కలెక్టర్​, సీఎంలే రావాలన్న విద్యార్థినిలు

Aug 30, 2024 - 18:12
 0
నాసిరకం భోజనంపై భగ్గు

నా తెలంగాణ, శంషాబాద్​: పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడమే గాకుండా ప్రశ్నించిన విద్యార్థుల కళ్లలో కారం కొట్టి వేధించారని శుక్రవారం విద్యార్థులంతా మూకుమ్మడిగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 

తమకు నాసిరకం భోజనం పెడుతూ.. ఉపాధ్యాయులు మాత్రం వేరే మెనుతో కూడిన భోజనాన్ని తింటున్నారని ఆరోపించారు. తమకు అలాంటి భోజనం పెట్టండని అడిగితే ఇంటి నుంచి తెచ్చుకోవాలని అంటున్నారని ఆరోపించారు. పాఠశాలలు అనేక సమస్యలపై ప్రశ్నిస్తే భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులు 10వ తరగతిలో ఎలా పాస్​ అవుతారో? చూస్తాం అంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. 

రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు సీఎం వచ్చి తమ సమస్యలు పరిష్​కరించాలని నినాదాలు చేశారు. ట్రాఫిక్​ జామ్​ కావడంతో పోలీసులు వచ్చి అక్కడి నుంచి జరగాలని సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చిద్దామని తెలిపారు. అయినా విద్యార్థులు గతంలోనే అనేకమార్లు విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లినా ఏం ప్రయోజనం లేకపోయిందని వారికి సమస్యలు పరిష్కరించడం చేతకాదని తేలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్​ లేదా సీఎంలే వచ్చి తమ సమస్యలను పరిష్​కరిస్తామని హామీ ఇస్తే ఆందోళన విరమిస్తామని మొండికేశారు.