సీఎం మమత వ్యాఖ్యలు భగ్గుమన్న బిహార్ డిప్యూటీ సీఎం
CM Mamata's comments Bhaggumanna Bihar Deputy CM
పాట్నా: బిహార్ ను తగులబెట్టే ధైర్యం ఎవ్వరికీ లేదని రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అన్నారు. మమత చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం స్పందిస్తూ భగ్గుమన్నారు. మమత బిహార్ తగినరీతిలో సమాధానం చెబుతుందన్నారు. మతిలేని వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తతలు, ఆందోళనలకు బిహార్ కు ఏం సంబంధమని నిలదీశారు. ఆడపిల్లలపై దారుణాలు జరిగితే అడ్డుకోకపోవడం, సరైన రీతిలో స్పందించకపోవడం, విచారించకపోవడం మమత ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తున్నాయని సామ్రాట్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో మమత అన్న వ్యాఖ్యలకు బిహార్ సరైన రీతిలో సమాధానం చెబుతుందన్నారు.