ప్రపంచానికే ఆదర్శంగా భారత మహిళా సాధికారత

బెర్హంపూర్​ విశ్వవిద్యాలయ 25వ స్నాతకోత్సవంలో ముర్ము

Mar 1, 2024 - 14:54
 0
ప్రపంచానికే ఆదర్శంగా భారత మహిళా సాధికారత

భువనేశ్వర్:  మహిళా సాధికారతలో ప్రపంచానికే భారత్​ ఆదర్శంగా నిలచిందని   ప్రెసిడెంట్​ ద్రౌపదీ ముర్ము అన్నారు. శుక్రవారం బెర్హంపూర్​ విశ్వవిద్యాలయం 25వ స్నాతకోత్సవంలో రాష్ర్టపతి ముర్ము  ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత మహిళలకు అవకాశాలిస్తే తమ సత్తా ఏంటో నిరూపించుకుంటారన్నదానికి ఈ పరిణామమే నిదర్శనమన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పురుషులను అధిగమించే స్థాయిలో రాణించడం దేశానికి గర్వకారణమన్నారు. సాయుధ దళాల్లో మహిళలు రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారని కొనియాడారు. 2047 నాటికి భారత్​ నారీశక్తి భాగస్వామ్యంతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక దేశంగా అవతరిస్తుందని తెలిపారు. 140 కోట్ల విశాల భారతదేశంలో 49 శాతం మహిళలు దేశ ఆర్థిక స్థితిని మార్చేందుకు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.