భారత్–ఫ్రాన్స్ రాఫెల్ ఒప్పందం?
చైనా–పాక్ వెన్నులో వణుకు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్–ఫ్రాన్స్ ఒప్పందంతో చైనా–పాక్ ల వెన్నులో వణుకుపుడుతోంది. రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్, రాఫెల్ ఎం విమానాలను భారత్ కు ఇచ్చేందుకు ఫ్రాన్స్ సుముఖంగా ఉంది. ఇందుకోసం ఫ్రాన్స్ ఉన్నతాధికారులు మంగళవారం భారత్ కు వచ్చారు. రక్షణ శాఖ ఉన్నతాధికారులతో తుది చర్చల అనంతరం మే 30న భారత్–ఫ్రాన్స్ మధ్య ఈ ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. ఈ ఒప్పందం విలువ రూ. 50వేల కోట్లు. దీంతో 26 రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. ఈ విమానాలను ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకల్లో మోహరించనున్నారు. ఇందుకోసం గతేడాదే భారత్ టెండర్ ప్రక్రియను జారీ చేసింది. ఈ ప్రక్రియకు ఫ్రాన్స్ కూడా దరఖాస్తు చేసుకుంది. ఆధునాతన రాఫెల్ రాకతో మిగ్ –29, సుఖోయ్ లపై ఒత్తిడి తగ్గనుంది.
రాఫెల్ మల్టీరోల్ ఫైటర్ జెట్. ఈ తరహా విమానాలు ప్రపంచంలో భారత్, చైనా మినహా ఏ దేశం వద్ద లేవు. అయితే చైనా యుద్ధనౌకలపై జే–10, జూ–15, సుఖోయ్–30 లాంటి యుద్ధ విమానాలను మోహరించారు. వీటికి మించి అత్యాధునిక సాంకేతికతను ప్రస్తుతం అందుకోబోతున్న యుద్ధ విమానాలు కలిగి ఉండడంతో చైనాలో కలరం మొదలైంది. దీని బరువు 15వేల కిలోలు. ఈ యుద్ధవిమానాలు డబుల్ సీటర్ నాలుగు, సింగిల్ సీటర్ 22 విమానాలు భారత్ కు అందనున్నాయి. డబుల్ సీటర్ రాఫెల్ లతో పైలెట్లకు శిక్షణ నిచ్చేందుకు వాడనున్నారు.