నవంబర్​ 25 నుంచిశీతాకాల సమావేశాలు

కేంద్రమంత్రి కిరణ్​ రిజుజు

Nov 5, 2024 - 17:21
 0
నవంబర్​ 25 నుంచిశీతాకాల సమావేశాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఈ యేడాది చివరి పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు నవంబర్​ 25 నుంచి డిసెంబర్​ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్రమంత్రి కిరణ్​ రిజుజు మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ సమావేశాల్లో పలు కీలకాంశాలపై చర్చ జరగనుంది. అదే సమయంలో పలు బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నారు. నవంబర్​ 26న రాజ్యాంగాన్ని ఆమోదించి 75యేళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్​ లోని సెంట్రల్​ హాల్​ లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తామని మంత్రి వివరించారు. 
జేపీసీ (జాయింట్​ పార్లమెంటరీ కమిటీ) సిఫార్సుల తరువాత వక్ఫ్​ సవరణ బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. భారత్​–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించడం లాంటి కీలక విషయాలపై చర్చించే అవకాశం ఉంది.