ఒలింపిక్స్ 2036 నిర్వహణ ఐఓఎ లేఖను ధృవీకరించిన ఐఓసీ
The IOC confirmed the IOA's letter to host the 2036 Olympics
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఒలింపిక్స్ 2036కు ఆతిథ్యం ఇచ్చేందుకు లేఖ రాశామని కేంద్రం తెలిపింది. మంగళవారం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బిడ్డింగ్ లో ఆమోదం పొందితే ఈ గేమ్స్ అహ్మాదాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ మేరకు భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఎ) అంతర్జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ కు (ఐఓసీ)కి లేఖ రాసింది. ఐఓసీ ఈ లేఖను ధృవీకరించింది. కాగా 2028న ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్ లో జరగనుండగా, 2032లో ఆస్ర్టేలియాలోని బ్రిస్బేన్ లో జరగనున్నాయి. 2036కు బిడ్డింగ్ జరగాల్సి ఉంది. బిడ్డింగ్ లో ఆమోదం పొందితే భారత్ లో ఒలింపిక్స్ నిర్వహణకు మార్గం సుగమమైనట్లే. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 15న ఎర్రకోట వేదికగా ‘ఒలింపిక్స్ 2036’కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుందని చెప్పిన విషయం తెలిసిందే.