ఎలక్టోరల్​ బాండ్ల నూతన డేటా విడుదల

సుప్రీం ఆదేశాలతో వివరాల వెల్లడి

Mar 17, 2024 - 19:17
 0
ఎలక్టోరల్​ బాండ్ల నూతన డేటా విడుదల

నా తెలంగాణ, న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన నూతన డేటాను ఎలక్షన్ కమిషన్ ఆదివారం వెల్లడించింది. ఈ డేటాను కమిషన్ మూసివేసిన కవరులో సుప్రీంకోర్టుకు అందజేసింది. అనంతరం ఈ డేటాను పబ్లిక్‌గా తెలియజేయాలని కమిషన్‌ను కోర్టు కోరింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019కి ముందు కాలానికి సంబంధించినవి. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను కమిషన్ గత వారమే తెలిపింది. కానీ ఏయే పార్టీలకు ఎంత విరాళాలు అందాయన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆ వివరాలను వెల్లడించింది. 

ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం..

బీజేపీ మొత్తం రూ.6,986.5 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను క్యాష్ చేసింది. ఇందులో 2019–-20లో పార్టీకి గరిష్టంగా రూ.2,555 కోట్లు వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ మొత్తం రూ.1,334.35 కోట్లు అందాయి. బీజేడీకి రూ. 944.5 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ (వైఎస్ఆర్సీపీ) రూ. 442.8 కోట్లు, రూ.181.35 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను టీడీపీ ఎన్‌క్యాష్ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తృణమూల్ కాంగ్రెస్ రూ.1,397 కోట్లు పొందింది. బీఆర్​ఎస్​రూ. 1,322 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను ఎన్‌క్యాష్ చేసింది. ఎస్పీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.14.05 కోట్లు పొందింది. అకాలీదళ్‌కు రూ.7.26 కోట్లు,
ఏఐఏడీఎంకేకు రూ.6.05 కోట్లు, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 50 లక్షలు వచ్చినట్లు ఎన్నికల కమిషన్​ వివరాలను వెల్లడించింది. 
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తమకు ఎలాంటి విరాళాలు అందలేదని మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలిపింది. దీనితో పాటు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), సీపీఐ (ఎం) కూడా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు స్వీకరించలేదని స్పష్టం చేసింది.