33 నుంచి 35 శాతానికి మహిళా రిజర్వేషన్ల పెంపు
మహిళా సాధికారతలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతలో మరో ముందడుగు వేసింది. అన్నివిభాగాల్లో మహిళల రిక్రూట్మెంట్ లలో రిజ్వేషన్లను 33 నుంచి 35 శాతానికి పెంచాలని నిర్ణయించింది. మంగళవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ర్టమంత్రి వర్గం భేటీలో ఆమోదం తెలిపింది. సీఎం మోహన్ యాదవ్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. దీంతో బాటు 254 ఎరువుల విక్రయ కేంద్రాల ప్రారంభం, సర్నిలో 660 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామక వయస్సు 40 నుంచి 50యేళ్లకు పెంపు, రేవా ప్రాంతీయ పారిశ్రామిక సదస్సు విజయవంతం పట్ల కేబినెట్ సంతోషం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో భోపాల్ లో ‘ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025’ ముందస్తు సదస్సు నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.