గెలుపోటములు సహజం
కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన సిఐ
నా తెలంగాణ, డోర్నకల్: ఆటల్లో గెలుపోటములు సహజమేనని గెలిచినవారు గెలుపుపై మరింత దృష్టి సారించాలని, అలాగే ఓటమి చెందిన వారు తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ విజయానికి ప్రయత్నించాలని డోర్నకల్ సిఐ ఉపేంద్ర రావు అన్నారు. మండలంలోని గొల్లచర్ల గ్రామంలో ఖాజాభాయ్ మెమోరియల్ ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల కబడ్డీ టోర్నమెంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ఆటల్లో గెలుపోటములు సహజమన్నారు. ఘర్షణలకు దిగడం తగదన్నారు. స్నేహపూర్వక వాతావరణంలోనే క్రీడలు కొనసాగాలని సిఐ తెలిపారు. టోర్నమెంట్ ను నిర్వహించిన వారిని అభినందించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ యువతలో నైపుణ్యాన్ని వెలికి తీయడం క్రీడా నిర్వాహకుల దూరదృష్టిని సిఐ ఉపేంద్ర రావు మెచ్చుకున్నారు. సరదాగా కాసేపు సిఐ కూడా కబడ్డీ కూతకు వెళ్లి క్రీడాకారులను, క్రీడా నిర్వాహకులను ఆశ్చర్యపరిచారు.