శ్రీరాముడిపై విషం గక్కుతారా? రామాలయానికి తాళం వేస్తారా? మందిరం పనికిరాదా?

మూడు దశల్లో బీజేపీకి 190 ఖాయం పౌరసత్వం కల్పించి తీరుతాం యూపీ ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్​ షా

May 8, 2024 - 18:05
 0
శ్రీరాముడిపై విషం గక్కుతారా? రామాలయానికి తాళం వేస్తారా? మందిరం పనికిరాదా?

లక్నో: బాబ్రీ పేరుతో రామాలయానికి తాళం వేసేందుకు కాంగ్రెస్​ పార్టీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా ఆరోపించారు. బుధవారం యూపీలోని ఖేరీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అజయ్​ మిశ్రా కు మద్ధతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి షా ప్రసంగించారు. ఎస్పీ నాయకుడు రామ్​ గోపాల్​ రామమందిరాన్ని పనికారాదంటారా? అని మండిపడ్డారు. వీరు ఇప్పుడే ఇలా ప్రకటిస్తున్నారంటే ఎన్నికల్లో వీరిని గెలిపిస్తే రామ మందిరానికి తాళం వేయరని గ్యారంటీ ఏమిటన్నారు. 70 ఏళ్లుగా ఈ అంశాన్ని కాంగ్రెస్​ అణగదొక్కిందన్నారు. హిందువులను మోసం చేసిందన్నారు. బీజేపీ మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం ఐదేళ్లలో కేసును కొలిక్కి తీసుకువచ్చి శాంతియుతంగా మందిరాన్ని నిర్మించిందన్నారు.

కనీసం ప్రాణప్రతిష్ఠకు కూడా హాజరు కాని విపక్ష నేతలు హిందువుల దేవుడు శ్రీరాముడిపై ఎంత విషం గక్కుతున్నారని మండిపడ్డారు. దేశంలో జరిగిన మూడు దశ ఎన్నికల్లోనే బీజేపీ 190 సీట్లను కైవసం చేసుకుంటుందని అమిత్​ షా ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్​ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. యూసీసీపై ప్రస్తావిస్తూ పాక్​ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన ప్రజలకు పౌరసత్వం ఇవ్వడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. రాహుల్​ బాబాకు పాక్​ లోని హిందువుల జనాభా గురించి పూర్తి లెక్కలు తెలియదన్నారు. 30 శాతంగా ఉన్న హిందువులు ఇప్పుడు మూడు శాతం కూడా లేరన్నారు. దీనిపై ఏం సమాధానం చెబుతారని మండిపడ్డారు. సీఏఏ ద్వారా పౌరసత్వ హక్కులు కల్పించి తీరుతామని కేంద్ర మంత్రి అమిత్​ షా పునరుద్ఘాటించారు.