రామభజనలో పాల్గొంటావా.. గొడ్డళ్లతో దాడి
Will you participate in Ram Bhajan? Attack with axes
అడ్డుకున్న కుమారులకూ గాయాలు
దర్యాప్తు చేపట్టామన్న అయోధ్య పోలీసులు
రామ మందిర నిర్మాణానికి మద్ధతిచ్చినందుకు ఆగ్రహం
పాట్నా: అయోధ్యలో బీజేపీ నాయకుడు బబ్లూఖాన్ పై గుర్తుతెలియని దుండగులు గొడ్డలితో దాడి చేశారు. ఈయన రామభజనలో పాల్గొన్నందుకే దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. శనివారం ఉదయం ఆయనపై దాడి జరిగింది. దర్శన్ నగర్ చౌకీ ప్రాంతంలోని మీర్జాపూర్ మాఫీ గ్రామంలో రామ మందిరంలో భజన జరుగుతోంది. బబ్లూఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఆగ్రహించిన కొందరు దుండగులు ఈయనపై గొడ్డళ్లు, కత్తులు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో బబ్లూ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీరాముడి భజనలో పాల్గొన్నందుకే అతనిపై దాడి చేశారని ఫిర్యాదు అందిందని అయోధ్య పోలీసులు బబ్లూఖాన్ తోపాటు ఆయన ముగ్గురు కుమారులకు కూడా గాయాలయ్యాయని తెలిపారు. బబ్లూఖాన్ తన మద్ధతుదారులతో తన క్యాంపు కార్యాలయంలో రామ భజన చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. అయితే కొందరు ఈయన వర్గానికి చెందిన వారే ఖాన్ భజనపై అభ్యంతరం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారందరిని విచారిస్తామన్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని అయోధ్య పోలీసులు చెప్పారు. బబ్లూఖాన్, ఆయన కుమారులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు.
కాగా 2014 నుంచి రామ మందిరానికి బబ్లూఖాన్ మద్ధతిచ్చారు. అప్పటి నుంచే అడపా దడపా ఆయనపై ముస్లింలలో ఆగ్రహం వ్యక్తం అవుతుందని పలు సందర్భాల్లో బీజేపీ నిర్ణయాలను సమర్థించడంతో వీరిలో ఆగ్రహం మరింతగా పెరిగింది. దీనికి తోడు బబ్లూఖాన్ సంస్కృత శ్లోకాలను కూడా అవలీలగా బహిరంగ వేదికలపై వినిపిస్తుండడం కూడా వీరి కోపానికి మరో కారణమైంది.