ఝార్ఖండ్ లో భూకంపం
Earthquake in Jharkhand
రాంచీ: ఝార్ఖండ్, రాంచీ, జంషెడ్ పూర్ లలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 3.6 నుంచి 4.13 వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జంషెడ్ పూర్, చైబాసా, ఖర్సావాన్ లలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంలో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తూ ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ఖర్సావాన్ జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం 9.20 గంటలకు సంభవించిందన్నారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు. దేశంలోని మొత్తం భూభాగంలో 59 శాతం భూభాగానికి భూకంప ముప్పు పొంచి ఉందని శాస్ర్తవేత్తలు గతంలో పేర్కొన్నారు.