చెంపదెబ్బలు, కాళ్లతో తన్నాడు ప్రాధేయపడినా వదల్లేదు
డ్రెస్సు చిరిగిపోయినా కనికరించలేదు చాతీ, కడుపులో తన్నాడు పోలీసులకు స్వాతి మాలివాల్ వాంగ్మూలం మీడియాకు లీకులిచ్చిన పోలీసు అధికారులు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్ ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు స్వాతిమాలివాల్ పై దాడి విషయంలో సంచలన విషయాలు వెలుగులొకొచ్చాయి. గురువారం అర్థరాత్రి వరకు పోలీసులు జరిపిన విచారణలో పేరు చెప్పేందుకు ఇష్టపడని కొందరు పోలీసు అధికారులు మీడియాకు శుక్రవారం వివరాలందించారు. స్వాతిమాలివాల్ ను సీఎం పీఏ విభవ్ 7–8 చెంపదెబ్బలు కొట్టాడన్నారు. తాను ప్రాధేయపడుతున్నా వినకుండా కాలితో కడుపులో తన్నారని పేర్కొన్నారు. తాను తప్పించుకునేందుకు ప్రయత్నించినా తన డ్రెస్సు పట్టుకొని లాగారని, దీంతో తన డ్రెస్సు కూడా కొంతభాగం చినిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. కాళ్లతో తంతు, చెంపదెబ్బలు కొడుతూ తీవ్రంగా బిభవ్ హింసించాడన్నారు. ఛాతీ భాగంలో కూడా కాళ్లతో తన్నాడని కన్నీటి పర్యంతమైనట్లు ఆ అధికారులు వివరించారు. ఎంతప్రాధేయపడుతున్నా వినకుండా తనపై దాడ చేశారని తాను చాలా అరిచానని ఎలాగోలా ప్రయత్నించి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి నేలపై పడిపోయిన తన గాజులను తీసుకొని పోలీసులకు ఫోన్ చేశానని తెలిపారు. తాను తీవ్రంగా షాక్ లో ఉండడంతోనే సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేకపోయానని అన్నారు.