హిజ్బొల్లా ఆయుధ డిపోపై ఐడీఎఫ్​ దాడి

వంద రాకెట్​ లాంచర్లు ధ్వంసం ఇజ్రాయెలీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ

Sep 20, 2024 - 14:56
 0
హిజ్బొల్లా ఆయుధ డిపోపై ఐడీఎఫ్​ దాడి

జేరూసలెం: పేజర్లు, వాకీటాకీల దాడులపై ప్రతీకారం తప్పదని, ఇజ్రాయెల్​ పై భారీ దాడి చేస్తామని హిజ్బొల్లా చీఫ్​ హసన్​ నస్రుల్లా ప్రకటించిన 48 గంటల్లోపే ఇజ్రాయెల్​ దక్షిణ లెబనాన్​ లోని ఆ ఉగ్ర సంస్థకు చెందిన వందకు పైగా రాకెట్ లాంచర్లపై దాడి చేసింది. గురువారం అర్థరాత్రి జరిపిన ఈ దాడిలో వంద రాకెట్​ లాంచర్లను ధ్వంసం చేశామని శుక్రవారం ఉదయం ఐడీఎఫ్​ తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసంది. వెయ్యికి పైగా రాకెట్​ బారెల్స్​ కూడా ధ్వంసం అయ్యాయని ప్రకటించింది. దక్షిణ లెబనాన్​ లోని హిజ్బొల్లా అతిపెద్ద ఆయుధ కర్మాగారంగా ఈ ప్రాంతం పేరు పొందింది. దీన్నే ఇజ్రాయెల్​ ధ్వంసం చేసింది. మరోవైపు హిజ్బొల్లా హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచంలో ఉన్న ఇజ్రాయెలీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఒక్కచోట చేరవద్దని పేర్కొంది.