రెన్యూవల్ చేయాలని విన్నపాలు
ఆర్థిక ఇబ్బందుల్లో అధ్యాపకులు
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
నా తెలంగాణ, సంగారెడ్డి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన అతిథి అధ్యాపకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించిన అతిథి అధ్యాపకులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అతిధిద్యాపకులు సంగారెడ్డి జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 205 మంది గెస్ట్ లెక్చరర్లు గత 11 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల నమోదు నుంచి అత్యుత్తమమైన రిజల్ట్ సాధించేవరకు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరే పేద విద్యార్థులకు ఉద్యోగ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వేతనాలతో నెట్టుకొస్తున్నారు. ఇంటర్ వ్యవస్థలో ఉన్న పార్ట్ టైం, కాంట్రాక్టు, ఎంటిఎస్ లెక్చరర్ల మాదిరిగానే కాలేజీ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో త్రీ మెన్ కమిటీ ఓపెన్ నోటిఫికేషన్ ఇంటర్వ్యూల ద్వారా డెమో ఈజీ మెరిట్ మార్కులు సాధించి అతిథి అధ్యాపకులు ఎంపిక అయ్యారు.
పీరియడ్ విధానంలో బోధించే ఎంటీఎస్ అధ్యాపకులను గత ప్రభుత్వం గుర్తించారే కానీ వారిలాగే పీరియడ్ విధానంలో బోధించినా తమ సేవలను గుర్తించలేక పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు 2011 అప్పటి ప్రభుత్వం ప్రారంభ వేతనంగా నెలకు పదివేలు చెల్లించేదని, ఏడాది గడిచిన అనంతరం రూ. 21 వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. 2020లో రూ.28 వీళ్లకు వేతనాలు పెంచారన్నారు. 2023 ఫిబ్రవరిలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాల్లో అప్పటి ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ 12 నెలల వేతనాలు మంజూరు చేయాలని ఆదేశించినప్పటికీ ఇంటర్ బోర్డు అధికారులు అమలు చేయలేదని దీనితో తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమ సేవలను గుర్తించకుండా ఇటు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించిందని విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేసేందుకు వేతనాలు సక్రమంగా అందకపోయినా సేవలందిస్తున్నామని, గత ప్రభుత్వం లా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమను ఆదుకుంటుందని భావించినా నిరాశ మిగిలిందని ఆవేదన చేస్తున్నారు అతిథి ఆధ్యాపకులు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పేద విద్యార్థులకు మంచిర్యాంకులు సాధించేలా కృషి చేస్తున్నప్పటికి తమను పట్టించుకోవడంలేదని ఆందోళన చెందుతున్నారు. గత మూడు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.
అతిథుల డిమాండ్స్..
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు టీజీపీఎస్సీ జెఎల్ నోటిఫికేషన్ తో సంబంధం లేకుండా రూ. 42 వేల వేతనంతో 12 నెలల్లో కన్సాలిడెటెడ్ వెంటనే అమలు చేయాలి.
గెస్ట్ లెక్చరర్లందరిని రెన్యూవల్ చేయాలి.
జనరల్ ట్రాన్స్ ఫార్మర్లను కోరుకున్న చోటుకు చేయాలి.
ఒకేషనల్ సెకండ్ పోస్ట్ కు అనుమతి ఇవ్వాలి.
మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలి.
ఇంటర్ గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
వేతనాలు ప్రతి నెల సక్రమంగా అందించాలి.
జూనియర్ కళాశాలలో పనిచేసే గెస్ట్ లెక్చరర్ అందరిని రెన్యువల్ చేయాలి. మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైన తమ సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.
శ్రీశైలం, గెస్ట్ లెక్చరర్ల యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పనిచేసే తమకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.
సాయిబాబా, యూనియన్ జిల్లా అధ్యక్షుడు