జన్ ధన్ కు దశాబ్దిపై ప్రధాని హర్షం
Prime Minister is happy about the decade of Jan Dhan
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజనకు బుధవారానికి (ఆగస్ట్ 28) పదేళ్లయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ఈ పథకం కింద 53 కోట్ల మంది లబ్ధిదారులు ఖాతాలు తెరిచారు. ప్రతీ గ్రామంలోనూ ఈ పథకం కింద భారీ ఎత్తున ఖాతాలు తెరిచారు. పేదరికాన్ని తరిమికొట్టడం, అట్టుడుగు వర్గాలను ప్రభుత్వ పథకాలను మరింత చేరువచేయడంలో ఈ ఖాతాల పాత్ర కీలకమన్నారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా ఆయా అట్టడుగు వర్గాల ఖాతాల్లోకి వెళ్లేందుకు వెసులుబాటు కలిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 67 శాతం, 55 శాతం మహిళలు ఈ జన్ ధన్ లో భాగస్వామ్యం అవ్వడం సంతోషకరమని ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా హర్షం వ్యక్తం చేశారు.