పాక్ బస్సు ప్రమాదం 28మంది మృతి
23 మందికి గాయాలు
కరాచీ: పాక్ నుంచి ఇరాక్ వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు మృతి చెందగా, 23 మందికి గాయాలయ్యాయి. బుధవారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సులో షియా యాత్రికులు వెళుతున్నట్లుగా అధికారి మహమద్ అలీ తెలిపారు. బస్సులో మొత్తం 51 మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. షియా పర్వదినం ఇమామ్ హుస్సేన్ బలిదానం 40వ రోజు పర్వదినానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. విషయం తెలుసుకొని గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించామని అలీ తెలిపారు. ప్రతీయేటా పాక్ నుంచి పెద్ద యెత్తున ఈ పర్వదినానికి హాజరయ్యేందుకు ఇరాన్ కు యాత్రికులు వెళుతుంటారు.