తెలంగాణ చిహ్నంలో కాకతీయుల కళాతోరణం తొలగింపు!

మార్పులు సూచించిన సీఎం రేవంత్​ రెడ్డి

May 27, 2024 - 23:13
 0
తెలంగాణ చిహ్నంలో కాకతీయుల కళాతోరణం తొలగింపు!

నా తెలంగాణ, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయబోతున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్​ రెడ్డి దాని మార్పులపై కసరత్తు చేస్తున్నారు. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నేతృత్వంలోని బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం చర్చించారు. సుమారు12 నమూనాలు రూపొందించగా.. వాటిలో ఒకటి సీఎం రేవంత్‌రెడ్డి ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులు సూచించారు. గత చిహ్నంలో చార్మినార్‌, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే, రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు రూపొందే చిహ్నాన్నే.. జూన్‌ 2న ఆవిష్కరించనున్నారు. ఇక రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన ‘జయ జయహే తెలంగాణ’కు తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి. సీఎం సూచనలతో భావం, భావోద్వేగం మారకుండా రెండు నిమిషాల గీతంలో కవి అందెశ్రీ మార్పులు చేశారు. సీఎం రేవంత్‌, అందెశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరకల్పన చేశారు. ఈ గీతాన్ని కూడా జూన్‌ 2న ఆవిష్కరించనున్నారు. మరోవైపు తెలంగాణ తల్లి రూపం ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం