కేజ్రీవాల్​ కు మరోసారి హైకోర్టు షాక్​

బెయిల్​ పై స్టే కొనసాగింపు

Jun 25, 2024 - 15:06
 0
కేజ్రీవాల్​ కు మరోసారి హైకోర్టు షాక్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేజ్రీవాల్​ కు మరోసారి హైకోర్టు షాక్​ ఇచ్చింది. బెయిల్​ మంజూరు కాలేదు. బెయిల్​ పై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం కేజ్రీవాల్​ బెయిల్​ పిటిషన్​ పై హైకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు పూర్తి కానందున బెయిల్​ మంజూరు చేయడం లేదని పేర్కొంది. మనీలాండరింగ్​ నిరోధక చట్టం కిం కింద కేజ్రీవాల్​ పాత్రను విస్మరించడంపై వెకేషన్​ బెంచ్​ తప్పు పట్టింది.

రౌస్​ అవెన్యూ కోర్టు నిర్ణయన్ని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాగా బెయిల్​ పిటిషన్​ పై బుధవారం సుప్రీంలోనూ విచారణ జరగనుంది. ఇంతకుముందు హైకోర్టు తీర్పు ఇవ్వనందున తీర్పుపై వేచి చూడాలని సుప్రీం పేర్కొన్న విసయం తెలిసిందే.