ఫెయింజల్ బాధితులను ఆదుకుంటాం
ప్రధాని నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఫెయింజల్ తుపాను కారణంగా నష్టపోయిన తమిళనాడును ఆర్థికంగా ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మంగళవారం ప్రధాని మాట్లాడుతూ.. అపారమైన నష్టంపై కేంద్రం వెంటనే చర్యలు తీసుకుంటుందన్నారు. తక్షణ సహాయం, కేంద్ర బృందాలపై కూడా సీఎం స్టాలిన్ తో మాట్లాడినట్లు తెలిపారు. పునరుద్ధరణ, పునరావాస ప్రయత్నాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి నిధులు అందజేస్తామన్నారు. ఫెయింజల్ తో 1.5 కట్ల మంది ప్రజలను ప్రభావితం చేసింది. ఈ తుపాను 14 జిల్లాల్లోని 2.11 లక్షల హెక్టార్ల పంటలకు నష్టం వాటిల్లింది. ఎడతెరిపి లేని వర్షాలు, భారీ ఈదురు గాలులతో ఆయా జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. తుపాను తీవ్రతతో తిరువణ్ణామలై జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు.