మాజీ సీఎంకు శిక్ష రామ్ రహీమ్ కు అనుకూలమే కారణం
Punishment of former CM is due to favor of Ram Rahim
అమృత్ సర్: డేరా సచ్చా రామ్ రహీమ్ కు అనుకూలంగా వ్యవహరించినందుకు గాను మాజీ డిప్యూటీ సీఎం సుఖ్భీందర్ సింగ్ బాదల్ కు అమృత్ సర్ స్వర్ణ దేవాలయ కమిటీ శిక్ష విధించింది. సుఖ్భీందర్ సింగ్ స్వర్ణ దేవాలయంలో ప్లేట్లు కడగాలని, భక్తులకు వడ్డించాలని స్పష్టం చేసింది. ఆయన వయస్సు రీత్యా ఈ శిక్షను విధించామని మంగళవారం ప్రకటించింది. ఈ వ్యవహారంలో సుఖ్భీందర్ సింగ్ సహా మరో 16 మందికి కూడా మతపరమైన శిక్షను విధించారు. స్వర్ణ దేవాలయం వద్ద మెడలో ఫలకం, చేతిలో ఈటెతో గేట్ మ్యాన్ గా సుఖ్భీందర్ విధులు నిర్వహించారు. గుర్మీత్ రామ్ రహీమ్ శిక్షపై సుఖ్భీందర్ సింగ్ ఆగస్టు 30న తన తప్పిదాన్ని అంగీకరించారు. దీంతో స్వర్ణ దేవలయం శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ మతపెద్దలు ఈ శిక్షను విధించారు.