బాబా బాగేశ్వర్ ను హత్య చేస్తాం
ఫేస్ బుక్ మాధ్యమంగా బెదిరింపులు చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగిన భక్తులు, హిందూ సంఘాలు
లక్నో: యూపీ బరేలీలో బాగేశ్వర్ ధామ్ కు చెందిన పండిత్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని హత్య చేస్తామని గుర్తు తెలియని దుండగులు ఫేస్ బుక్ మాధ్యమంగా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆయన భక్తులు బుధవారం అమలా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బెదిరింపుపై హిందూ సంఘాల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లో భక్తులు, ఆయన మద్దతుదారులు ఫిర్యాదు చేశారు. కృష్ణ శాస్త్రి ఫోటోను అసభ్యంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని మండిపడ్డారు. ఆయన శిరచ్ఛేదం చేసిన ఆడియోను కూడా పొందుపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తమవుతోంది. కాగా బెదిరింపులపై పోలీసులు ఫైజ్ రజా అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. బెదిరింపులకు పాల్పడ్డది ఇతనే కాదా అనేది విచారిస్తున్నారు. పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డ నిందితులను అరెస్టు చేస్తామని ప్రకటించారు. అంతవరకు భక్తులు, హిందూ సంఘాలు శాంతిని పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.