జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 495.5 కోట్ల నిధులు
భారతదేశంలో కనెక్టివిటిని మెరుగుపరిచేందుకు కృషిలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని ఉదమ్‌సింగ్‌నగర్, నైనిటాల్ జిల్లాల్లో జాతీయ రహదారి 121 కాశీపూర్ ను రామ్‌నగర్ సెక్షన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు రూ. 495.45 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి మంగళవారం ఎక్స్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు.
ఢిల్లీ: భారతదేశంలో కనెక్టివిటిని మెరుగుపరిచేందుకు కృషిలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని ఉదమ్‌సింగ్‌నగర్, నైనిటాల్ జిల్లాల్లో జాతీయ రహదారి 121 కాశీపూర్ ను రామ్‌నగర్ సెక్షన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు రూ. 495.45 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి మంగళవారం ఎక్స్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. రహదారి నిర్మాణం సందర్భంగా పలు నిర్మాణాలకు నష్టం వాటిల్లనుండడంతో దీనిపై న్యాయ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర అధికారులు గత కొన్ని రోజుల క్రితం జరిపిన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించారు. దీంతో జాతీయ రహదారి నిర్మాణానికి అడ్డంకులు తొలగినట్లయింది. మరోవైపు ప్రభుత్వం నిధులను విడుదల చేయడంతో ఇక రహదారి నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోనుంది. ఈ కనెక్టివిటి ద్వారా మొరాదాబాద్, రాంపూర్, ఢిల్లీ, లక్నో లకు చేరుకోవచ్చు. ఈ రహదారి కాశీపూర్ రామ్నగర్సెక్షన్ జిమ్ కార్బెట్ నేషనల్పార్క్కు కనెక్టివిటీని మెరుగుపర్చనుంది.