యూపీఎస్సీలో మెరిసిన పాలమూరు ఆణిముత్యం దోనూరు అనన్యా రెడ్డి
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక సర్వీస్ కమిషన్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
నా తెలంగాణ, న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక సర్వీస్ కమిషన్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. 2023 యూపీఎస్సీ ఫలితాల విడుదలలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకును ఆదిత్య శ్రీవాస్తవ్ సాధించగా, రెండో ర్యాంకును అనిమేష్ ప్రదాన్ సాధించారు. మూడో ర్యాంకును దోనూరు అనన్యా రెడ్డి దక్కించుకున్నారు. పీ.కె. సిద్ధార్థ్ నాలుగు, రుహాని ఐదో స్థానాన్ని సాధించారు.
పాలమూరు జిల్లా నుంచి దోనూరుఅనన్యా రెడ్డి ఆణిముత్యంలా మెరిసారు.