ఇమ్రాన్ రాజకీయ సలహాదారుడి కిడ్నాప్
Kidnapping of Imran's political adviser
ఇస్లామాబాద్: పాక్ పిటీఐ ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సలహాదారు గులాం షబ్బీర్ కిడ్నాప్ కు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు ఇతన్ని రెండు రోజుల క్రితమే కిడ్నాప్ చేసినట్లు మీడియా గురువారం వార్తలు వెల్లడించింది. తన నివాసం నుంచి ఇస్లామాబాద్ కు వెళ్లేందుకు బయలుదేరగా కిడ్నాప్ చేశారని అతని కుమారుడు బిలాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతవరకూ షబ్బీర్ ఆచూకీ లభించకపోవడంతో పిటీఐలో ఆందోళన నెలకొంది.