మూడువారాల్లోనూ 70యేళ్లు పైబడిన 4880మందికి ఉచిత చికిత్సలు
4.5 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చనున్న మోదీ ప్రభుత్వం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్ భవన వే వందన కార్డు (ఆయుష్మాన్ భవ కార్డు)ను కేవలం మూడువారాల్లోనే 10 లక్షల మంది వృద్ధులు అందుకున్నారు. సోమవారం ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది.
ఈ కార్డు కింద 70యేళ్ల వృద్ధులకు ఉచిత చికిత్సలను అందజేయనున్నారు. మూడువారాల్లో 5 లక్షల మంది పురుషులు, 4 లక్షల మంది మహిళా వృద్ధురాళ్లు కార్డును పొందినట్లు పేర్కొన్నారు. అంతేగాక పథకం ప్రారంభమయ్యాక రూ. 9 కోట్లు ఖర్చయ్యే వివిధ వైద్య చికిత్సలు 4880మందికి నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కరోనరీ యాంజియోప్లాస్టీ, హిప్ ఫ్రాక్చర్స్, రీప్లేస్‌మెంట్,,పిత్తాశయం తొలగింపు, కంటిశుక్లం శస్త్రచికిత్స, ప్రోస్టేట్ విచ్ఛేదనం, స్ట్రోక్ వంటి అనేక రకాల చికిత్సలను పొందినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మోదీ ప్రభుత్వం 4.5 కోట్ల కుటుంబాలలోని ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్ లకు ప్రయోజనం చేకూరనుంది.