అర్చకుల హక్కుల సాధనకు ఐక్యంగా నిలవాలి
ధూప దీప నైవేధ్య పథకాలను వర్తింప చేయాలి వయోవృద్ధులైన అర్చకులకు పెన్షన్ అందజేయాలి బ్రహ్మంగారి ఆలయ అర్చకులు తాటిపాముల
నా తెలంగాణ, డోర్నకల్: విశ్వ బ్రాహ్మణ అర్చకుల హక్కుల సాధనకు ఐక్యతగా నిలవాలని పోతులూరి బ్రహ్మంగారి ఆలయ అర్చకులు తాటిపాముల శివకృష్ణ చార్యులు తెలిపారు. ఈ నెల 25న (గురువారం) తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘ సమావేశం బ్రహ్మంగారి ఆలయంలో జరగనుందని శివకృష్ణ తెలిపారు. బ్రహ్మంగారి, హిందూ దేవాలయాల్లన్నింటిలోనూ ధూప దీప నైవేధ్యం పథకాలను వర్తింప చేసుకునేందుకు సంఘటితంగా పోరాడాలన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఆయా పథకాలను అన్ని దేవాలయాలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ అర్చకుల్లో వయోవృద్ధులైన అర్చకులకు రూ. 5వేలు పెన్షన్ అందజేయాలని అర్చకులు తాటిపాముల డిమాండ్ చేశారు.