మహా ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు
అలర్టయిన అధికారులు, రెస్క్యూబృందాలు
ముంబై: మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పరిస్థితుల నేపథ్యంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ చర్యల్లో నిమగ్నమయ్యారు. బుధవారం కూడా ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతుండడంతో ఆయా జిల్లాల్లోని పలు గ్రామాలు నీట మునిగాయి. భండారా, కొల్హాపూర్, సాంగ్లీ, రాయ్‌గఢ్, గడ్చిరోలి వరదల్లో చిక్కుకున్నాయి. నదుల ఉధృతి నేపథ్యంలో తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
పెన్ గంగా, గోషఖుర్ధ్ డ్యామ్, పంచగంగా, కుండలికా, సాంగ్లీలో కృష్ణా నది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోగా, పలు హైవేలను మూసివేశారు. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యల్లో తలమునకలైంది.
మరోవైపై ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు వరద పోటెత్తుతోంది.