నా తెలంగాణ, మెదక్: ఎస్సీ, ఎస్సీ ఉప కులాలకు ఎళ్లవేళలా అండగా ఉంటామని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. వారిని తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు. పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లిలో ఎమ్మార్పీఎస్ నాయకుడు అల్లారం రత్నయ్య ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఎస్సీ, ఎస్సీ ఉపకులాగా ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్ల పోరాట ఫలితంగా కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేస్తుందని మైనంపల్లి తెలిపారు.
అనంతరం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లారం రత్నయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే తమకు అండగా ఉంటే తాము వారి వెంట ఎళ్లవేళలా నడుస్తామన్నారు. మాదిగ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయడానికి ఎమ్మెల్యే తమ వంతు కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా అల్లారం రత్నయ్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని, సమావేశానికి హాజరైన దళిత నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి, త్యార్ల రమేష్, దళిత సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.