అష్టలక్ష్మీ మహోత్సవ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
Prime Minister Modi inaugurated the Ashtalakshmi Mahotsav
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఈశాన్య భారత పర్వదినం అష్టలక్ష్మీ మహోత్సవ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం భారతమండపంలో ప్రారంభించారు. ఈ పర్వదినాన్ని మూడురోజులపాటు నిర్వహిస్తారు. సాంస్కృతిక వస్త్రాలు, సాంప్రదాయ కళలు, చేతిపనులు, సాంస్కృతిక అభ్యాసాల శ్రేణులు ఈ పర్వదినం సందర్భంగా ఒక్కచోటకు చేరతాయి. ఈశాన్య సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెబుతాయి. ఈ మహోత్సవ్ సందర్భంగా ఈశాన్య భారత ప్రసిద్ధ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.
ఈ మహోత్సవంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, నృత్యాలు, పాటలను ప్రదర్శించారు. రకరకాల వస్తువుల్ని ప్రదర్శనలో కొలువుదీర్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారంతా ఈశాన్య రాష్ర్టాలను సెవెన్ సిస్టర్స్‌గా పిలిచే సాంకేతిక అంశాలపై చర్చించనున్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, హస్తకళలు, చేనేత వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులకు ఎలా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ కల్పించాలనే దానిపై దృష్టిసారించారు. అనంతరం రౌండ్ టేబుల్ సమవేశం నిర్వహించారు. ఇందులో అమ్మకాలు, కొనుగోళ్లదారులు తమ తమ ఉత్పత్తుల క్రయ, విక్రయాలను చేపట్టారు.