వయోనాడ్​ మృతులు 341

డీప్​ సెర్చ్​ రాడార్లతో వెతకాలని నిర్ణయం 118 సహాయ శిబిరాల్లో 13వేలమందికి ఆశ్రయం మైనింగ్​ పై నిషేధం

Aug 3, 2024 - 12:53
 0
వయోనాడ్​ మృతులు 341
వయోనాడ్​: కేరళలోని వయోనాడ్​ ఘటనలో మృతుల సంఖ్య శనివారం ఉదయానికి 341కు చేరుకున్నట్లు అధికారులు వివరించారు. వీరిలో 146 మంది మృతులను గుర్తించామన్నారు. మరో 134 మంది ఎవరన్నది తెలియరాలేదన్నారు. 
 
ఇంకా రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగిస్తున్నామని తెలిపారు. శిథిలాల కింద 20 నుంచి 30 అడుగుల మేర మృతదేహాలు కూరుకుపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో డీప్ సెర్చ్​ రాడార్​ తో శోధించాలని అధికారులు ఆర్మీని కోరారు. ఈ రాడార్​ ద్వారా భూమిలోపల 80 మీటర్ల లోతులో ఉన్న మనుషులను గుర్తించే అవకాశం ఉంది. ఈ తరహా రాడార్లను ఎక్కువగా సియాచిన్​ గ్లేసియర్​, హిమాలయ పర్వత ప్రాంతాల్లో వాడతారు.
 
కాగా 74 గుర్తు తెలియని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. 17 సహాయ శిబిరాల్లో 707కుటుంబాలకు చెందిన 2,597మంది ఆశ్రయం పొందుతున్నారు. మరో 91 సహాయ శిబిరాల్లో 10వేలమందికి పైగా ఆశ్రయం కల్పించామన్నారు. 
 
మరోవైపు కేరళలోని పలు ప్రాంతాల్లో మైనింగ్​ ను నిషేధిస్తూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి.