పార్లమెంట్​ కుస్తీ మైదానమా?

Is Parliament a wrestling ground?

Dec 19, 2024 - 12:18
 0
పార్లమెంట్​ కుస్తీ మైదానమా?

రాహుల్​ అంగబల ప్రదర్శనపై రిజిజు మండిపాటు
ఆసుపత్రిలో సారంగికి చికిత్స.. కేంద్రమంత్రుల పరామర్శ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బీజేపీ ఎంపీ ప్రతాప్​ సారంగిని రాహుల్​ గాంధీ నెట్టివేయడాన్ని కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజు తప్పుబట్టారు. అంగబలం ప్రదర్శించేందుకు పార్లమెంట్​ కుస్తీ పోటీల మైదానం కాదన్నారు. గురువారం రిజిజు మీడియాతో మాట్లాడారు. అంగబలం ప్రదర్శించే చోటు పార్లమెంట్​ కాదని, కరాటే, కుంగ్​ ఫు స్థలం కాదని తెలివితేటల సభలో, సభ ప్రాంగణంలో ప్రదర్శించాలని అన్నారు. తాము కూడా అంగబలాన్ని ప్రదర్శిస్తే పార్లమెంట్​ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. ఇది బాక్సింగ్​ అరేనా కాదని రాహుల్​ తెలుసుకోవాలన్నారు. బీజేపీ ఎంపీని తోసివేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ తోపులాట ఘటనను పార్లమెంట్​ స్పీకర్​ సీరియస్​ గా తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలో తప్పెవరిదో తేల్చే పనిలో పడ్డారు. సారంగి ఆరోపణలు నిజమైతే రాహుల్​ గాంధీపై చర్యలు తీసుకోనున్నారు. 

సారంగిని పార్లమెంట్​ నుంచి రామ్​ మనోహర్​ లోహియా ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందజేస్తున్నారు. ఆయన్ను  కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ రామ్ లు పరామర్శించారు.