శ్రీకృష్ణ జన్మభూమి ముస్లిం పక్షం పిటిషన్ తిరస్కరణ
Srikrishna Janmabhoomi Muslim side's petition rejected
మథుర: మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి కేసులో ముస్లిం పక్షం పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. గురువారం ఈ కేసుపై విచారణ చేపట్టింది. హిందూ పక్షం దాఖలు చేసిన 18 పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది. జన్మభూమిపై ఇరు వర్గాలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. షాహి ఈద్గాలోని రెండున్నర ఎకరాల స్థలం మసీదు కాదని హిందూ పక్షం తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ స్థలంలో శ్రీ కృష్ణ దేవాలయం ఉందన్నారు. మరోవైపు ముస్లిం పక్షాలు 1968లో ఒప్పందం ప్రకారం స్థలం మసీదుకు ఇచ్చారని వాదించారు. ఇరుపక్షాల వాదనను విన్న హైకోర్టు ముస్లిం పక్షాల వాదనను తోసిపుచ్చింది.