బంగ్లా రిజర్వేషన్లు విద్యార్థులకు అనుకూలంగా సుప్రీం తీర్పు
Supreme verdict in favor of bungalow reservation students
ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అనుకూలంగా అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశంలో అత్యవసర పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సుప్రీం ఆదివారం అత్యవసరంగా కేసును విచారించింది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారి వారసులకు ప్రస్తుతం ఉద్యోగాల్లో ఇస్తున్న 30శాతం కోటాను 5శాతానికి తగ్గించింది. 93శాతం ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని బంగ్లా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. మరో 2శాతం కోటా మైనార్టీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు కేటాయించింది.