నిర్ణయాల అమలుపై విశ్వాసం

గవర్నర్ల సదస్సులో రాష్ర్టపతి ముర్మూ

Aug 4, 2024 - 14:36
 0
నిర్ణయాల అమలుపై విశ్వాసం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రజా సంక్షేమం కోసం వివిధ రాష్ర్టాల గవర్నర్లు విలువైన సూచనలు, సలహాలతో ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని భారత రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు. సదస్సులోని మెరుగైన నిర్ణయాలను గవర్నర్లు అమలు చేస్తారనే విశ్వాసం ఉందన్నారు.
రెండో రోజు (చివరిరోజు) న్యూ ఢిల్లీలోని గవర్నర్ల సదస్సులో మాట్లాడారు. గవర్నర్ల సమిష్ఠి కృషి అభినందనీయమన్నారు. పరస్పరం చర్చలు జరపడం ప్రశంసనీయమని కొనియాడారు.  రాష్ట్రాలను కలుపుకొని వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూనే దేశాభివృద్ధి కి తోడ్పాటు అందించాలని అన్నారు. అన్ని రాష్ట్రాలు పరస్పరం సహాయ సహకారాలతో ముందుకు సాగితే ఆశించిన లక్ష్యాలను మరింత త్వరగా నెరవేర్చుకోవచ్చని ముర్మూ పేర్కొన్నారు. 
 
ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో అర్హులైన వారికి ఫలాలు అందించడంలో గవర్నర్లు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ సంక్షేమ ఫలాలను అందుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు రాష్ర్ట ప్రభుత్వాల సహకారంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. రాజ్​ భవన్​ తో సామాన్యుల అనుబంధాలను పెంచేందుకు కృషి చేయాలన్నారు. 
 
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న గవర్నర్లు ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన పాత్ర వహించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ అన్నారు.