ఓటింగ్ లో రికార్డులు నమోదు చేయాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ప్రతీఒక్కరూ ఓటు హక్కు వినిగించుకోవాలని, ఎక్కువ సంఖ్యలో మొదటి విడతలో జరిగే ఎన్నికల్లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ ప్రారంభమైందన్నారు. తమ శక్తిని ఉపయోగించుకునే అవకాశం ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుందని దాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్న నాడే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ముఖ్యంగా యువత ఓటింగ్ లో ఎక్కువ పాల్గొని రికార్డులు సృష్టించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.